- గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్
- 18న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
- ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణారావు అధికారులతో సమీక్ష
హైదరాబాద్, మహా: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్-2 కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 18న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరుగనుంది. మొత్తం 782మంది గ్రూప్-2 అభ్యర్థులు ఈ సందర్భంగా నియామక పత్రాలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే, సర్టిఫికెట్ల పరిశీలనను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే రెవెన్యూ, హోమ్, జీఏడీ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Post Views: 60





