Mahaa Daily Exclusive

  బీజేపీ ఆఫీసులో డిష్యుం… డిష్యుం…పరస్పరం కొట్టుకున్న బీసీ నేతలు

Share

  • బీజేపీ ఆఫీసులో డిష్యుం… డిష్యుం…
  • పరస్పరం కొట్టుకున్న బీసీ నేతలు
  • మీడియా ముందే దాడులు
  • రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కోరిన కృష్ణయ్య.

హైదరాబాద్, మహా : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఒక్క సారిగా వాతావరణం హీటెక్కింది. బీసీ సంఘాల నేతలు, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న రాష్ట్ర బంద్‌కు బీసీ జేఏసీ ఛైర్మన్‌ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావును కలిసి మద్ధతు కోరేందుకు ఆర్ కృష్ణయ్య కార్యాలయానికి వచ్చారు. బీసీ నేతలు, బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని నేతలను కోరారు. ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫొటోల కోసం ఈ రెండు వర్గాల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకవైపు నుంచి రామచందర్ రావు, ఆర్ కృష్ణయ్య వారిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. తమ గొడవలో నిమగ్రమైపోయి ఉన్నారు. దీంతో మిగిలిన నేతలు వెంటనే కలుగజేసుకుని గొడవను సర్దుమణిగించారు. కేవలం మీడియా ముందు కనిపించేందుకే నేతలు దాడులు చేసుకోవడం గమనార్హం.

జీవో ఎంఎస్ 9 అమలుపై స్టే కు నిరసనగా రాష్ట్రంలోని బీసీ సంఘాలు ఈనెల 18వ తేదీన బంద్ పాటించాలని డిసైడ్ అయ్యాయి. అయితే ఇదే విషయమై ఆదివారం సమావేశమైన 33 బీసీ సంఘాలు సుదీర్ఘంగా చర్చించాయి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీగా ఏర్పడ్డ బీసీ సంఘాలన్నీ కలిసి ఛైర్మన్ గా బీసీ జాతీయ సంక్షేమసంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యను ఛైర్మన్ గా సమావేశం నియమించింది. వైస్ ఛైర్మన్ గా వీజీఆర్ నారగోని, వర్కింగ్ ఛైర్మన్ గా జాజుల శ్రీనివాస గౌడ్, కో ఛైర్మన్ గా దాసు సురేష్, రాజారామ్ యాదవ్ ను సమావేశం నియమించింది. ఈ జేఏసీ ఆధ్వర్యంలోనే బంద్ ను విజయ వంతం చేసేందుకు బీసీ నేతలు పార్టీల నేతలను కలిసి మద్ధతును కూడగడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీ నేతలను కలిసి మద్ధతు కోరారు

Latest