Mahaa Daily Exclusive

  మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు: అగ్రనేత ఆశన్న బృందం జనజీవన స్రవంతిలోకి

Share

  • జనజీవన స్రవంతిలోకి ఆశన్న బృందం
  • మావోయిస్టు చరి త్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు
  • భారీగా ఆయుధాలు స్వాధీనం చేసిన మావోయిస్టులు

ఛత్తీస్ ఘడ్, మహా : మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తాజా పరిణామం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత గడువు దగ్గర పడుతున్న తరుణంలో కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. చాలా రోజులుగా ప్రచారం కొనసాగుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపో యారు. వారితో పాటు మరో 208 మంది పార్టీ సభ్యులు కూడా సరెండర్ కాగా వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు భారీగా తుపాకులు, మారణాయుధాలను పోలీసులకు స్వాధీనపరిచారు. వాటిలో 153 తుపాకులు, 11 గ్రనేడ్ లాంచర్లు, 41 సింగిల్ షాట్ గన్స్, లైట్ మెషీన్ గన్స్ ఉన్నాయి. మొత్తానికి సరెండర్ అయిన వారిలో అగ్ర నేతల్లో ఆశన్నతో పాటు డీకేఎస్ఆడ్సీ సభ్యులు భాస్కర్ అలియాస్ రాజామన్ మాండవి, నిత, రాజు సలాం, ధన్ను వెట్టి అలియాస్ సంతు, మావోయిస్టు పార్టీ ప్రాంతీ య కమిటీ రతన్ ఎలామ్ ఉన్నా రు.

ఇదిలా ఉండగా 208 మంది మావోయిస్టులు ఒకే సారి లొంగిపోవడం చారిత్రక దినం అని ఛత్తీస్ ఘఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ఆయుధాలు వదిలిపెట్టిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నా రు. హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు లకు సీఎం విష్ణుదేవ్ సాయ్ సూచించారు

Latest