విజయనగరం జిల్లా. మహా:
స్వతంత్ర భారత దేశ సమైక్యతా యోధుడు,స్వాతంత్ర్య సమర యోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు.శుక్రవారం కారుణ్య ఫౌండేషన్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ 150 జయంతి నేపథ్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని కారుణ్య కార్యదర్శి సి హెచ్ జె ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జె సి రాజు మాట్లాడు తూ.. భారత దేశ ఉక్కు మనిషిగా ఖ్యాతి గాంచిన పటేల్ దేశభక్తికి పట్టుదలకు నిదర్శనం అన్నారు,మొదటి హోమ్ మంత్రిగా స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి దేశ సమైక్యత రూపశిల్పి గా,ఐక్యతకు చిహ్నంగా నిలిచారన్నారు. సర్ధార్ పటేల్ జీవితం ఆదర్శం అని అన్నారు కార్యక్రమంలో కారుణ్య సభ్యులు జి సిహెచ్ జి శర్మ, ఏ చిన్నారావు,కె రామ కృష్ణ,పి కృష్ణ మోహన్ తదితరాలు పాల్గొన్నారు
Post Views: 17






