- ఘనంగా ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.
- మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్య పోరాటాలు నిర్వహించాలని కార్మికుల లోకానికి పిలుపు.
- జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మునకాల శ్రీనివాస్..
విజయనగరం జిల్లా. మహా:
దేశ స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి అగ్ర భాగాన నిలబడి బ్రిటిష్ వారిని తరిమికొట్టడంలో కీలక పోరాట భూమిక పోషించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని. ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న ఏర్పడిందని ఇప్పుడు 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుదని బొబ్బిలి పట్టణంలో శుక్రవారం నాడు జండా మహల్ సెంటర్ లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముందుగా ఏఐటీయూసీ పతాకావిష్కరణను జిల్లా డిప్యూటీజనరల్ సెక్రెటరీ మునకాల శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలలో భాగంగా బ్రిటిష్ కాలంలో కార్మికుల చేత రోజుకు సుమారు 15 గంటలు పని చేయించుకుని వారి శ్రమను దోచుకున్న బ్రిటిష్ వారి విధానాలను అవలంబిస్తూ కార్మికుల శ్రమని కార్పొరేట్ శక్తులకు ధారాధత్వం చేయడానికి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వత్తాసు పలకడం వర్గాన్ని మోసం చేయడమే అన్నారు. జిల్లాలో జూట్ మిల్లులు. ఫెర్రోయెల్లోస్ కంపెనీలు మూతపడడం వలన వేలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని. ఎన్నికల ముందు కార్మిక వర్గానికి ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సరైన పరిశ్రమలు లేక ఎంతో నైపుణ్యత కలిగిన నిరుద్యోగ యువత బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వలస పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎనిమిది గంటల పని దినాలానే కొనసాగించాలని నేను యెడల ఏఐటీయూసీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న. ఏఐటీయూసీ పట్టణ నాయకులు వై బాబ్జి. సూరి సత్యనారాయణ, రామారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బి రవికుమార్, రామారావు తదితరులు పాల్గొన్నారు.






