Mahaa Daily Exclusive

  మంత్రివర్గంలోనూ వాటా దక్కాల్సిందే:ఎంపీ ఈటల

Share

  • మంత్రివర్గంలోనూ వాటా దక్కాల్సిందే
  • బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి
  • 78 ఏళ్లు అయినా తెలంగాణలో బీసీ సీఎం ఎందుకు కాలే
  •  బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు
  • బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, మంత్రివర్గంలో మన వాటా మనకు దక్కాల్సిందేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ పొలిటికల్ లీడర్ నాయకత్వంలో ఉండకూడదని, నిక్కచ్చిగా నడిపేవారు నాయకత్వం వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాకపోతే ఉద్యమం సక్సెస్ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. అందుకే అన్ని పార్టీలను భాగస్వాములను చేసి జేఏసీ అందరిదిగా ఉండాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కోసం ఇవాళ బంజారాహిల్స్ లోని కళింగ భవన్‍లో జరిగిన బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏసీ కూడా వందల సార్లు ఇచ్చుక పోయేదని కానీ ఓపిక పట్టి కలిపి ఉంచామని ఈటల చెప్పారు. బీసీ జేఏసీ వేదిక ఎవరికి వారు పార్టీ ఉపన్యాసాలు ఇచ్చుకునేందుకు, ఎవరి సిద్ధాంతం వారు చెప్పడానికి కాదన్నారు. మనదంతా రాజ్యాధికారం అనే ఒకటే సిద్ధాంతం ఉండాలన్నారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా తెలంగాణలో బీసీ సీఎం ఎందుకు కాలేదని ప్రశ్నించారు. బీసీ జనాభా ఎక్కువ ఉన్నా బీసీ సీఎం ఎందుకు కాలేదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి తప్ప వేరే వారిని దూషణలు అవసరం లేదన్నారు. రిజర్వేషన్ల సాధనతో పాటు బీసీ జేఏసీ మరో పని చేయాలని ఈటల సూచించారు.

డబ్బులతో ఓట్లు కొనుక్కొనే వ్యవస్థను ధ్వంసం చేయాలని పెట్టుబడి దారులు, డబ్బులు ఎరవేసి వారు ఉన్నంత కాలం మనం గెలవలేమన్నారు. ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ అని మన సమాజం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందన్నారు. చైతన్యం మన లక్షణం. తెలంగాణ మట్టి ప్రజలు అన్యాయంను సహించరని చెప్పారు. మనది గొంతెమ్మ కోరిక కాదని న్యాయమైన కోరిక అన్నారు.ఈ దేశంలో బ్రాహ్మణ, వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని మనం న్యూనత భావనతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తు పొందారని కులం మతం పేదరికం విజ్ఞానికి అడ్డం కాదని గుర్తు చేశారు. డబ్బులతో సీట్లు కొనుక్కున్న వారి వల్ల నాణ్యత కోల్పోతున్నాం తప్ప రిజర్వేషన్ల వల్ల కాదని ఈటల అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు అనే ఆలోచన తెలంగాణ సమాజం, బీసీ జాతుల్లో వచ్చింది. తొందర పడకండి ఈ రిజర్వేషన్లు ఎక్కడికి పోవని అందుకే మొన్న బంద్ విజయవంతం అయ్యిందని చెప్పారు. మీలాంటి సంఘాల పుణ్యమే బీసీ లీడర్ల గెలుపు అన్నారు. మంద కృష్ణ ఉద్యమం చూసి మోడీ ఒక మాట అన్నారు. 30 ఏళ్లుగా జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమం అణిచి వేసే అధికారం ఎవరికీ లేదు అని చెప్పారని గుర్తు చేశారు. మనకు అసాధ్యమైంది ఏమీ లేదాని కావాల్సింది కమిట్మెంట్ మాత్రమేనన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఆగవద్దని చెప్పారు