- నీ అక్రమాలు త్వరలోనే బయటపెడతా
- ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమా?
- ఎమ్మెల్యే మాధవరంకు అరికెపూడి గాంధీ బహిరంగ సవాల్
హైదరాబాద్, మహా: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలు త్వరలోనే బయటపెడతాను అని అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర విమర్శలకు దిగడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే కృష్ణారావుకు, అరికెపూడి గాంధీ బహిరంగ సవాల్ విసిరారు. ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమా?అని నిలదీశారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక భూమి కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు.‘‘ 2008లో నా భూమి ఎస్‌ఎఫ్‌సీ భూముల్లో ఉందని ఆరోపణలు వచ్చాయి. నా భూమికి ఎస్‌ఎఫ్‌సీ భూమికి సంబంధం లేదని ఆ తర్వాత హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపణల్లో వాస్తవం లేదు. ఈ విషయంలో ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా’ అని చెప్పారు
Post Views: 51








