ఆలేరు (నవంబర్ 2 మహా పత్రిక)
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో విజయం సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్ల గూడెం గ్రామానికి చెందిన ముస్త్యాల సుగంధిని అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా జనగాం జిల్లాలో నియమితులయ్యారు. అయితే తాను చదివిన ఎన్టీఆర్ ట్రస్ట్ డిగ్రీ మరియు ఐఏఎస్ స్టడీ సెంటర్ కళాశాల గండిపేట హైదరాబాద్ నందు ట్రస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి నారాభువనేశ్వరి తమ కళాశాల విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా గ్రూప్ వన్ ఫలితాలలో అధికారిగా నియామకం కావడం తమ కళాశాలకు గర్వకారణమని ప్రశంసించారు . తమ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కుమారి సుగంధినిని శాలువాతో మెమొంటోతో సన్మానించి ఆమె తల్లిదండ్రులు ముస్త్యాల రవికుమార్ నిర్మలను అభినందించారు.. తమ కళాశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ కళాశాల అకాడమిక్ డీన్ మరియు అధ్యాపక బృందాన్ని కూడ నారా భువనేశ్వరి అభినందించారు . సుగంధిని గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ వరుస విజయాలు సాధించారు. గ్రామీణ విద్యార్థులు సైతం పట్టుదలతో చదివితే ఉన్నత ఉద్యోగ అవకాశాలు సాధించవచ్చు అని తమ కళాశాలలో ఐఏఎస్,గ్రూప్ వన్ సాధన కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపా






