- శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు భరోసా..!
- నీలక్కల్‌లో రూ.6.12 కోట్లతో ఆరోగ్య కేంద్రం.
- శబరిమల మార్గంలో సదుపాయాల విస్తరణ.
మహా.
ఆధ్యాత్మిక భక్తి, మానవ సేవ కలిసినప్పుడు సృష్టించబడే ఉదాత్త దృశ్యం నీలక్కల్‌లో కనిపిస్తోంది. శబరిమల యాత్రికుల కోసం సౌకర్యాల విస్తరణలో భాగంగా కేరళ ప్రభుత్వం రూ.6.12 కోట్లతో అత్యాధునిక స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి కేవలం ఒక వైద్య కేంద్రం మాత్రమే కాదు ఇది భక్తి, భద్రత, సేవల మేళవింపు. లక్షలాది మంది భక్తులు ఎరుమెలీ నుండి సబరిమల పర్వత మార్గం వరకు చేసే దీక్షా యాత్రలో, నీలక్కల్ బేస్ క్యాంప్ ఒక కీలక విశ్రాంతి స్థలం. ఇప్పుడు అదే ప్రదేశం వైద్యరక్షణకు పునాది అవుతోంది. శబరిమల యాత్ర కేవలం పూజా ప్రక్రియ కాదు. అది మానసిక, శారీరక క్రమశిక్షణకు ప్రతీక. 48 రోజుల మండల దీక్ష తర్వాత “స్వామి శరణం అయ్యప్ప” అంటూ భక్తులు నీలక్కల్, పాంపా, సబరిమల మార్గం వైపు ప్రయాణిస్తారు. ఈ క్రమంలో శారీరక శ్రమ, పర్వత మార్గాలు, వాతావరణ మార్పులు కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ స్పెషాలిటీ ఆసుపత్రి యాత్రికులకు రక్షణ కవచం లాంటిది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, శబరిమల యాత్రికుల శ్రేయస్సును నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆసుపత్రి ప్రతిబింబిస్తుంది అన్నారు. భక్తి యాత్రలో పాల్గొనే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం కూడా ఆధ్యాత్మిక సేవలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్య సేవల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అయ్యప్ప భక్తుల పట్ల కేరళ ప్రభుత్వ భక్తి గా భావించవచ్చు.
ఆసుపత్రి నిర్మాణం.. భక్తుల రక్షణకు ఆవాసం.
ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కేటాయించిన స్థలంలో నిర్మించబడుతున్న ఈ ఆసుపత్రి మొత్తం 10,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ఇందులో మూడు ఔట్‌పేషెంట్ గదులు, అత్యవసర విభాగం, ఐసియు, నర్సుల స్టేషన్, ఇసిజి గది, ఫార్మసీ, ఎక్స్‌రే గది, బహుళ ఆపరేషన్ థియేటర్లు, స్క్రబ్ స్టేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం వైద్య సేవల కేంద్రం మాత్రమే కాదు నీలక్కల్ మార్గంలో భక్తులకు రక్షణదామం. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు శబరిమల ఆలయ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించడం ద్వారా ఆ సంస్థ తన సేవాభావాన్ని మరోసారి నిరూపించింది. భక్తులకు మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు అందించడమే కాక, ఇది సేవా ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. శబరిమల మార్గంలో భక్తులకు నీరు, ఆహారం, వసతి, వైద్య సహాయం అందించడంలో దేవస్వం బోర్డు నిరంతరం సహకరిస్తోంది






