హైదరాబాద్, మహా : టీ సాట్ లో ముఖ్యమంత్రి నుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆధర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ‘సీఎం లాంగ్ లీవ్, సీఎం లాంగ్ లీవ్’ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వం శ్రీరామరక్ష అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్ ముఖ్యఅతిథిగా హాజరవగా తెలంగాణ మాసపత్రిక ఎగ్జుక్యూటీవ్ ఎడిటర్ కోడూరి శ్రీనివాసరావు, టి-సాట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.డి.సాదిక్ పాషా, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, వ్యవసాయ కమిషన్ ప్రజాసంబంధాల అధికారి కంచె రాజు, సీనియర్ జర్నలిస్టులు కొండల్ గౌడ్, గంటా రాంబాబు తదితరులు పాల్గొన్నారు






