- విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తే.. వాళ్లు రివాల్వార్లు ఇస్తున్నారు
- బిహార్‌లో పిల్లలు డాక్టర్లు కావాలా? దోపిడీదారులు కావాలా?
- 15 ఏళ్ల పాలనలో జంగిల్ రాజా బీహార్‌కు చేసింది ఏమీ?
- ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ హాట్ కామెంట్స్
బీహార్, మహా: బీహార్ సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీహార్‌లో మొదటి దశ ఎన్నికలు ముగియగా.. అక్టోబర్ 11న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. బీహార్ విద్యార్థులకు మేము ల్యాప్‌టాప్‌లు ఇందిస్తే వాళ్లు రివాల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “విద్యార్థులకు మేము కంప్యూటర్లు, ఫుట్‌బాల్, హాకీ స్టిక్‌లు ఇస్తున్నాం. ఆర్జేడీ మాత్రం ప్రజలకు రివాల్వర్లు ఇవ్వడంపై మాట్లాడుతోంది. ప్రజలు తుపాకుల ప్రభుత్వం కావాలని కోరడం లేదు. ఆర్జేడీ ఎన్నికల ప్రచారంలో జంగిల్‌రాజ్ పాటలు, నినాదాలు వింటే షాక్ అవుతారు. పిల్లలను దోపిడీదారులుగా మార్చేందుకు ఆర్జేడీ నేతలు యత్నిస్తున్నారు.
డాక్టర్లు కావాలా లేదా దోపిడీదారులు కావాలా?
బిహార్‌లో పిల్లలు డాక్టర్లు కావాలా లేదా దోపిడీదారులు కావాలా?. మన పిల్లలను చెడ్డవాళ్లుగా చేయాలనుకునేవారిని మనం గెలిపిస్తామా?. కాంగ్రెస్,ఆర్జేడీకి పరిశ్రమలకు సంబంధించి ఏ,బీ,సీ,డీలు కూడా తెలియవు. కానీ పరిశ్రమలను మాత్రం ఎలా మూసివేయాలో తెలుసు. జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో బీహార్‌లో పెద్ద ఆస్పత్రి గానీ.. వైద్య కళాశాల కానీ ఏర్పాటు చేయలేదు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వచ్చాకే ఇక్కడి ప్రజలకు నమ్మకం వచ్చింది. పెట్టుబడిదారులు బీహార్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను నిందించిన వాళ్లను ఎన్నికల్లో శిక్షించాలి.” అంటూ ఓటర్లను కోరారు






