Mahaa Daily Exclusive

  ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేత. ఎమ్మెల్యే బేబీ నాయన..

Share

విజయనగరం జిల్లా.మహా:
బొబ్బిలి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే బేబీ నాయన 14 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యానికి ఆర్థికస్తోమత లేని బాధితులు సాయం కోసం అర్థించగా, స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ10,50,000/- లను మంజూరు చేయించారు.18 నెలల కూటమి ప్రభుత్వం కాలంలో బొబ్బిలి నియోజకవర్గంలో రూ2 కోట్లు పైన సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడు తూ.. పార్టీలకు అతీతంగా కష్టంలో ఉన్న ప్రతిఒక్కరినీ కూటమి ప్రభుత్వం అందుకుంటుందని అన్నారు..ప్రజలకు ఆరోగ్యం దేశ అభివృద్ధికి మూలమని, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సాయం ఆశాజ్యోతి కావాలని ఆకాక్షించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు

Latest