Mahaa Daily Exclusive

  డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సెషన్స్…

Share

  • డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సెషన్స్
  • మొత్తం 19 రోజుల పాటు శీతాకాల సమావేశాలు
  • ప్రజా సమస్యలు, దేశ అభివృద్ధి అంశాలపై చర్చ, కొత్త చట్టాలు: కిరణ్ రిజిజు
  • అసాధారణంగా ఆలస్యం.. బిల్లులు ఆమోదించాల్సిన అవసరం లేదా?: జైరాం రమేశ్ కౌంటర్

 

ఢిల్లీ, మహా: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాల వరకు జరుగుతాయని వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్​ ఎక్స్​ వేదికగా పలు వివరాలు పంచుకున్నారు. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. రాబోయే పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అర్థవంతమైన ఫలితాలను నిర్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన చెప్పారు.

చర్చలు అనుమతించాల్సిన అవసరం లేదేమో: జైరాం రామేశ్
ఈ సమావేశంలో కీలక బిల్లులు, ఆర్థికాంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రతిపక్షాలు అనేక అంశాలపై కేంద్రానికి లోతైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. గత సమావేశాల్లో లాగానే ఈసారీ రాజకీయ వేడి రగిలే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాలు 18వ లోక్‌సభకు మరింత కీలకమని, ప్రజా సమస్యలు, దేశ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగి, కొత్త చట్టాలు రూపొందే అవకాశం ఉందని రిజిజూ చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు సఫలం కావాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని ఆశిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అసాధారణంగా ఆలస్యం చేసిందని, కుదించిందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రభుత్వానికి లావాదేవీలు చేయాల్సిన పని లేదని, బిల్లులు ఆమోదించాల్సిన అవసరం లేదని, చర్చలు అనుమతించాల్సిన అవసరం లేదేమోనని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం శీతాకాల సమావేశాలు కేవలం 15 పని దినాలు మాత్రమే ఉంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పోస్ట్ పెట్టారు

Latest