Mahaa Daily Exclusive

  ‘నవీన్ యాదవ్‌ను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం’: మంత్రి పొన్నం ప్రభాకర్

Share

  • జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసి చూపిస్తాం
  • నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. యూసుఫ్ గూడా కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విద్యావంతుడు, యువకుడు, పేద ప్రజల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల సమస్యలపై అవగాహన నవీన్‌కు ఉందన్నారు. సినీ కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్నవాడు వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉండే వ్యక్తి అని చెప్పారు. ఉన్నత విద్యావంతుడు నవీన్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలు నిండుగా ఆశీర్వదిస్తున్నారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీన వర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అసహనంతో మాట్లాడుతుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉందని, అక్కడ 10 వేల ఓట్లు కూడా ధాటవని విమర్శించారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగ బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థి మీద సంబంధం లేని రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయన్నారు. కంటోన్మెంట్‌లో గెలిచిన మాదిరి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

Latest