Mahaa Daily Exclusive

  నవీన్ ను గెలిపించినందుకు థ్యాంక్స్:ఎంఐఎం అధినేత ఓవైసీ

Share

  • నవీన్ ను గెలిపించినందుకు థ్యాంక్స్
  • బీఆర్ఎస్ కిందికి పడిపోయిన పార్టీ
  • ఎంఐఎం అధినేత ఓవైసీ

హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ కింది స్థాయికి పడిపోయిన పార్టీ అని ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. నన్ను విమర్శిస్తే బలపడతామని బీఆర్ఎస్ అనుకుంటోందని అన్నారు. అజారుద్దీన్‌పై కోపం నాపై తీర్చుకుంటున్నారని కామెంట్స్ చేశారు.

Latest