హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రజలు అభివృద్ధికి మద్ధతు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఫెయిల్ అయ్యారని మంత్రి వివేక్ విమర్శించారు. వీక్ లీడర్ షిప్ కారణంగా బీఆర్ఎస్ ఓడిపోతోంది.. కేటీఆర్, హరీష్ మధ్య గొడవలు వచ్చేలా ఉన్నాయి.. వీళ్లిద్దరిలో ఎవరు బెటర్ లీడర్..? అని కార్యకర్తలు ఆలోచించుకోవాలి.. పార్టీ బతకాలంటే ఏం చేయాలి..? ఫెయిల్యూర్ అవుతున్నడు అని ఆలోచించుకోవాలి.. కేటీఆర్ కింద పనిచేయాలా వద్దా అని హరీశ్ ఆలోచించాలి..? అని సూచించారు.
Post Views: 45





