Mahaa Daily Exclusive

  దేశ స్ట్రాటజిక్ డిఫెన్స్ హబ్ గా తెలంగాణ:మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

Share

  • దేశ స్ట్రాటజిక్ డిఫెన్స్ హబ్ గా తెలంగాణ
  • 2030 నాటికి ‘ఏరో ఇంజిన్ రాజధాని’ గా తీర్చిదిద్దుతాం
  • ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం కీలకపాత్ర పోషించేలా ప్రణాళికలు
  • 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

హైదరాబాద్, మహా: 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ‘ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్‌’ ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. ‘ఎండ్ టూ ఎండ్ ఎకోసిస్టం’ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటజిక్ డిఫెన్స్ హబ్ గా మార్చాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ మెంట్, ఐఎస్బీ ముంజాల్ ఇన్సిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహించిన ‘ఎంపవరింగ్ ఆత్మనిర్భర్ భారత్: ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రక్షణరంగ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి రేటు..
ప్రపంచవ్యాప్తంగా ఏ అండ్ డీ రంగంలో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల వల్ల గ్లోబల్ సప్లై చెయిన్ ఒత్తిడికి గురవుతుందని, ఈ తరుణంలో విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం ప్రపంచం ముఖ్యంగా ‘భారత్’ లాంటి దేశాలవైపు చూస్తోందన్నారు. గతేడాది దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రక్షణరంగ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఈ రంగ పురోగతికి నిదర్శనమన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యసాధనలో ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’ రంగం కీలకపాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ పి. మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Latest