Mahaa Daily Exclusive

  ఐబొమ్మతో రవి 20 కోట్ల సంపాదన..! అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లు..

Share

  • ఐబొమ్మతో రవి 20 కోట్ల సంపాదన
  • అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లు
  • ఈ రాకెట్‌లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం
  • పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టాం: సజ్జనార్‌
  • హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ

 

హైదరాబాద్, మహా: సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగిందన్నారు హైదరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌. హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. పైరసీ మాస్టర్‌ మైండ్‌, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి రవి సినిమాలు అప్‌లోడ్‌ చేసేవాడు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టినట్టు సజ్జనార్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడని సజ్జనార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశాం. దేశవ్యాప్తంగా పైరసీ సమస్య ఉంది. నిందితుడు రవి.. కొత్త టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు అప్‌లోడ్‌ చేసేవాడు. రవిని విచారిస్తున్నాం. నిందితుడికి అంతర్జాతీయ లింకులు ఉన్నాయి. ఐబొమ్మ రాకెట్‌ ఛేదించేందుకు జాతీయ సంస్థల సపోర్టు తీసుకుంటాం. ఉదయం విడుదలైన సినిమా.. సాయంత్రానికి ఐబొమ్మ రవి వద్ద ఉండేది. ఐబొమ్మ రవిపై మూడు పైరసీ కేసులు ఉన్నాయి.

 

పోలీసులకే సవాల్‌ విసిరాడు..

రవి వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. రవి ప్రమోట్‌ చేసిన బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది డిజిటల్‌ అరెస్ట్‌ అయ్యారు. ఐబొమ్మ రవి వెనుక డార్క్‌ వెబ్‌సైట్లు ఉన్నాయి. రవి స్వస్థలం విశాఖపట్నం. మహారాష్ట్రలో ప్రహ్లాద్‌ పేరుతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాడు. రవి.. పోలీసులకే సవాల్‌ విసిరాడు. 50 లక్షల మంది సబ్‌స్కైబర్ల డేటా మంది రవి దగ్గర ఉంది. ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. రవి హార్ట్‌ డిస్క్‌లో అన్ని సినిమాలు ఉన్నాయి. టెలిగ్రామ్‌ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్‌లోడ్‌ చేశాడు. నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టామన్నారు. రవి చేసిన బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు. రవి నుంచి రూ. 3 కోట్లు ‍స్వాధీనం చేసుకున్నారు. సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది’ అన్నారు.

Latest