- మావోయిస్టుల ఫేక్ ఎన్‌కౌంటర్స్ విచారకరం
- కేంద్ర ప్రభుత్వ విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, మహా : మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారన్నారు. మంగళవారం మాడేరుమిల్లులో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్, అంతకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్‌కౌంటర్స్ అని కూనంనేని తెలిపారు. బూటకపు ఎన్ కౌంటర్స్‌తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చేయడం విచారణకరమన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని డిమాండ్ చేశారు.
Post Views: 19






