Mahaa Daily Exclusive

  నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Share

  • డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
  • యువత చెడు వ్యసనాలకు అలవాటు పడొద్దు
  • నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, మహా: మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా బయటపడే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అండ్ ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. “డ్రగ్స్‌కు దూరంగా… జీవిత లక్ష్యాలకు దగ్గరగా” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేరేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మంగళవారం గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం వైపు నిలబెట్టడం ప్రభుత్వం ఒక ప్రధాన బాధ్యతగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాలతో పెరుగుతున్న దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మూలించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీజీ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీనియర్ సిటిజన్ & ట్రాన్స్‌జెండర్ విభాగం డైరెక్టర్ శైలజ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, గాంధీ హాస్పిటల్ సూపరిండెంటెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం తదితరులు పాల్గొన్నారు.
=======================

Latest