Mahaa Daily Exclusive

  దొంగతనం చేస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్…..

Share

  • నకిలీ అధికారి ఇంట్లో పోలీసుల సోదాలు
  • దొంగతనం చేస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్
  • పట్టుబడ్డ ఏఐఆర్ కానిస్టేబుల్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ డ్రైవర్

హైదరాబాద్, మహా : ఏఐఎస్ అదికారినంటూ పలువురిని బురిడీ కొట్టిస్తూ తప్పించుకున్న తిరుగుతున్న శశికాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం పోలీసులు పట్టుబడ్డ నకిలీ ఏఐఎస్ అధికారి శశికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్ ఒక కానిస్టేబుల్ తోటి పోలీసులకు చిక్కాడు. సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. . ఐఏఎస్ , ఐపిఎస్ అధికారినంటూ శశికాంత్ అనే వ్యక్తి పలువురిని మోసం చేసి ఇటీవలే పోలీసులకు చిక్కాడు. ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం శశికాంత్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో కానిస్టేబుల్ ఎస్. శరణ్ దొంగతనానికి పాల్పడ్డట్టు బయటపడింది. సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ (సీఏఆర్) విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న శరణ్ నకిలీ అధికారి శశికాంత్ ఇంట్లో సోదాల సందర్భంగా దొంగతనానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. ఈ దొంగతనాన్ని మరో కానిస్టేబుల్ వీడియో చిత్రీకరణ చేస్తున్న సమయంలో రికార్డయ్యింది. నేరస్థుడి ఇంట్లో సోదాలు చేసే సమయంలో రికార్డు చేయడం పోలీసుల విధి. విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శరణ్ దొంగతనానికి పాల్పడం పోలీసు శాఖకు తలవొంపులు తెచ్చింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎఆర్ కానిస్టేబుల్ శరణ్ ను ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శరణ్ రోలెక్స్ వాచీని చోరీ చేశాడు. అయితే ఈ రోలెక్స్ వాచీ నకిలీదని పోలీసులు తేల్చారు. శశికాంత్ నివాసమున్నషేక్ పేటలోని అపర్ణా ఔరా ఖరీదైన ప్లాట్ అని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్లాట్ లో ఉంటూ శశికాంత్ అనేక నేరాలకు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బిల్డర్లను బెదిరిస్తూ ఈ నకిలీ అధికారి వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆయుధ లైసెన్స్ ఉన్న ఇద్దరు వ్యక్తులను బిల్డర్లుగా నియామకం చేసుకుని బెదిరింపులకు పాల్పడి నకిలీ అధికారి శశికాంత్ వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బెట్టింగ్ యాప్ మోజులో పడ్డ హైదరాబాద్ కు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ భాను ప్రసాద్ తనకు ప్రభుత్వం ఇచ్చిన రివాల్వర్ ను విక్రయించిన ఘటన మరువక ముందే ఎఆర్ కానిస్టేబుల్ శరణ్ నేరస్థుడి ఇంట్లో సోదాలు చేస్తూ పట్టుబడటం తెలంగాణలో సంచలనమైంది. శరణ్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శరణ్ గతంలో చేసిన నేరాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు.

Latest