Mahaa Daily Exclusive

  రాజ్‌భవన్ టు లోక్‌భవన్‌

Share

  • రాజ్‌భవన్ టు లోక్‌భవన్‌
  • మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
  • కేంద్ర ప్రభుత్వం సూచనలతో ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్‌భవన్, రాజ్‌నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అందుకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

Latest