న్యూడిల్లీ, మహా : కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షుల సమావేశఁలో తాను చేసిన వ్యాఖ్యలపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ముందూ వెనక కట్ చేసి.. ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. హిందూ దేవుళ్లూ, హిందూ సమాజం లాంటిదే కాంగ్రెస్ పార్టీ కూడా అని కొత్తగా ఎన్నికైన తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు చెప్పినట్లు వివరించారు. అయినా తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించడం జరిగిందని అన్నారు.
అసలు రేవంత్ ఏమన్నారంటే
హిందు దేవుళ్ళపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. సమావేశంలో మాట్లాడుతు హిందువులకు ఎంత మంది దేవుళ్ళున్నారు ? 3 కోట్లున్నారా అని ప్రశ్నించాడు. పెళ్ళి చేసుకోనివాళ్ళకు హనుమంతుడు ఉన్నాడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు ఇంకో దేవుడున్నాడు, మందుతాగేవారికి ఇంకో దేవుడున్నాడు, కల్లుతాగేవాళ్ళకు, కోడిని కోయాలనే వాళ్ళకు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఉన్నారు. పప్పుతినే వాళ్ళకు కూడా దేవుడున్నాడు, అవునా ? అన్నీరకాల దేవుళ్ళున్నారు , అని అన్నారు. ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది.






