Mahaa Daily Exclusive

  దివ్యంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపుదాం: కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు.

Share

విజయనగరం జిల్లా,మహా:
దివ్యంగుల లో ఆత్మస్తైర్యాన్ని పెంపొందించవలసిన భాద్యత సమాజం పై వున్నదని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు.బుధవారం నాడు స్థానిక బొబ్బిలి కారుణ్య కార్యాలయంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని కారుణ్య సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా కారుణ్య సభ్యులు 16 మంది దివ్యంగుల ను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు. కారుణ్య ఉపాధ్యక్షులు నాగురు రమేష్ మాట్లాడు తూ… సమాజం దివ్యంగుల యెడల జాలి చూపటం కంటే వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాలన్నారు. దివ్యంగుల ప్రతినిధి రాంబాబు మాట్లాడుతూ దివ్యంగుల ను గుర్తించి సత్కరించి న కారుణ్య సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియచేసారు.కార్యక్రమంలో చిన్నారావు,సోమేశ్,కృష్ణ మోహన, రమేష్ చందు,రమేష్,దివ్యంగులు పాల్గొన్నారు.

Latest