Mahaa Daily Exclusive

  దేవరకొండను దత్తత తీసుకోమని ఎమ్మెల్యేతో కలిసి సీఎంను కోరుతా:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Share

నల్లగొండ, మహా : రాష్ట్రంలో పేద ప్రజలకు బాసటగా నిలిచే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా పాలన సాగుతోందని, కొడంగల్ లాగానే వెనుకబడిన దేవరకొండను దత్తత తీసుకోవాలని, ఎమ్మెల్యే బాలు నాయక్, తాను కలిసి ముఖ్యమంత్రిని కోరతామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రజాపాలన ప్రజావిజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన జరగనుందని మంత్రి వెల్లడించారు. గురువారం దేవరకొండలో స్థానిక ఎమ్మె ల్యే బాలునాయక్ తో కలిసి బహిరంగసభ ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు, సభా ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనీ 12ని యోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం దేవరకొండ అని అన్నారు. ఈనెల 6న ప్రజా పాలన,ప్రజా విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నదనీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తండాలలో అభివృద్ధి కుంటుపడిందనీ, కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని మంత్రి మండిపడ్డారు. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధలో కొంచెం పెట్టిన ఎస్ఎల్ బీసీ పూర్త య్యేదన్నారు. 10 ఏళ్లు పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్ బీసీ పనులు తిరిగి ప్రారంభించామని తెలిపారు.
దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి 8మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో సొరంగం నిర్మాణ పనులు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా గ్రావిటీ ద్వా రా నల్లగొండకు నీటికి తీసుకువస్తామని చెప్పారు. నక్కల గండి, దిండి ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా నీటిని నింపుతామని, భూగర్భ జలాలు పెంచుతామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ లో నీటిని నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్ డీఎస్ఏ తెలిపిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకే ప్రాంగణంలో 3వేల మంది వి ద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అభ్యసించేలా ఒక్కో నియోజకవర్గంలో 200 కోట్లతో రా ష్ట్ర వ్యాప్తంగా 20 వేల కోట్లతో యం గ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

Latest