Mahaa Daily Exclusive

  రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్(Rangareddy Land Records AD Srinivas) అరెస్ట్ అయ్యారు.

Share

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఏడీ శ్రీనివాస్‌కు రాయదుర్గం మైహోం భుజాలో ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపురంలో మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌నగర్‌లో నాలుగు ఎకరాలు, నారాయణపేటలో మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇంట్లో రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, రెండు విలువైన కార్లు, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest