Mahaa Daily Exclusive

  డీసీసీ పగ్గాలు స్వీకరించిన మేడిపల్లి సత్యం..! అభినందన సభలో పాల్గొన్న మంత్రి పొన్నం..

Share

  • డీసీసీ పగ్గాలు స్వీకరించిన మేడిపల్లి సత్యం
  • అభినందన సభలో పాల్గొన్న మంత్రి పొన్నం

 

కరీంనగర్ మహా : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో గత అధ్యక్షుల అనుభవాలు, జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకుపోతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత అంజన్ కుమార్ కు అర్బన్ డిసిసి అధ్యక్షులుగా అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి తప్పకుండా అవకాశం వస్తుందన్నారు. కార్యక్రమంలో డిసిసి అర్బన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ , సిరిసిల్ల జగిత్యాల డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నందయ్య ఒడితల ప్రణవ్, జువ్వాడి జువ్వాడి నర్సింగా రావు, , కటకం మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ,ఎండి తాజ్, సిరాజ్ హుస్సేన్, కొరివి అరుణ్ కుమార్, మడుపు మోహన్, పులి ఆంజనేయులు గౌడ్, శ్రవణ్ నాయక్, కర్ర సత్య ప్రసన్నారెడ్డి, కర్ర రాజశేఖర్, పురం రాజేశం, పత్తి మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Latest