- ఇండిగో విమానాల రద్దుతో ప్రత్యేక రైళ్లకు గిరాకీ
- 37 రైళ్లకు 116 బోగీలు జోడించాలని రైల్వేశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రత్యేక రైళ్లకు గిరాకీ పెరిగింది. దీంతో ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబయికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రకటన చేశారు. మరోవైపు 37 రైళ్లకు 116 కోచ్‌లు అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో సర్వీసులు కొనసాగుతున్నాయి.
శంషాబాద్ లో 155 సర్వీసులు రద్దు
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 9 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ వెళ్లేవి ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 11 సర్వీసులు రాకపోకలు కొనసాగిన్నాయి.హైదరాబాద్ నుంచి 155 ఇండిగో విమానసర్వీసులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి.






