Mahaa Daily Exclusive

  ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త …సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు….

Share

 

హైదరాబాద్, మహా : సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు ప్రకటించగా తాజాగా మరో 16 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. వేర్వురు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ – శ్రీకాకుళం (ట్రైన్ నెంబర్ 07288) మధ్య జనవరి 9 , 11 తేదీల మధ్ స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరునాడు మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు.

ఇక శ్రీకాకుళం – సికింద్రాబాద్ మధ్య జనవరి 10, 12 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం నుంచి బయల్దేరి.. మరునాడు ఉదయం 8.10 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్స్ చర్లపల్లి, కాజీపేట, ఖమ్మం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలసం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇక సికింద్రాబాద్ – శ్రీకాకుళం (ట్రైన్ 07290) జనవరి 10,12,16,18 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. అంతేకాకుండా జనవరి 11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం – సికింద్రాబాద్(07291) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

వికారాబాద్ – శ్రీకాకుళం మధ్య జనవరి 13వ తేదీన ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇక జనవరి 14వ తేదీన శ్రీకాకుళం – సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్స్ లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కాజేపీట, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాప్లి, దువ్వాడ, కొత్తవలసం, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

జనవరి 17వ తేదీన సికింద్రాబాద్ – శ్రీకాకుళం, జనవరి 18వ తేదీన శ్రీకాకుళం – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.