మంగళగిరి, మహా
యువయంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బ్యాట్ పట్టారు. క్రికెట్ ఆడుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. జనవరిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళగిరిలో ఎంపీఎల్-4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 21 వరకు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 125 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఇవాళ మ్యాచ్‌ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు బ్రాహ్మణి, నటుడు నిఖిల్ సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు.
Post Views: 26





