* సామాజిక న్యాయానికి పెద్దపీట.
* పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్త సారథులు.
* 14 అధ్యక్ష పదవులు బహుజనులకే!
* సీనియర్, జూనియర్ కలయికతో టీడీపీ నూతన కమిటీలు
* ఐదుగురు మహిళలకు పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు
* సామాజిక సమీకరణాలతో టీడీపీ సరికొత్త వ్యూహం.
అమరావతి,మహా.
తెలుగుదేశం పార్టీ మరోసారి తన నిబద్ధతను చాటుకుంటూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను టీడీపీ అధిష్టానం అధికారికంగా విడుదల చేసింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో సామాజిక సమతూకాన్ని ప్రదర్శిస్తూ ఈ నియామకాలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా, క్షేత్రస్థాయిలో నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నూతన నియామకాల్లో బహుజన వర్గాలకు సింహభాగం దక్కడం విశేషం. మొత్తం 25 పార్లమెంట్ అధ్యక్ష పదవుల్లో 14 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు కేటాయించడం ద్వారా టీడీపీ తన సామాజిక ఎజెండాను స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనితో పాటు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, ఐదు కీలక పార్లమెంట్ స్థానాలకు మహిళా నేతలను అధ్యక్షులుగా నియమించడం విశేషం. గద్దె అనురాధ, పనబాక లక్ష్మి, గౌరు చరితా రెడ్డి వంటి నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేశారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే క్రమంలో సీనియర్ల అనుభవాన్ని, జూనియర్ల ఉత్సాహాన్ని సమన్వయం చేస్తూ ఈ కమిటీలను రూపొందించారు. అరకు నుంచి నంద్యాల వరకు ప్రతి నియోజకవర్గంలోనూ సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించేలా అభ్యర్థుల ఎంపిక జరిగింది. విజయనగరంలో కిమిడి నాగార్జున, అనకాపల్లిలో బుద్ధ నాగజగదీశ్వరరావు, చిత్తూరులో షణ్ముగ రెడ్డి వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నూతన కమిటీల నియామకంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు ఈ మార్పులు దోహదపడతాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమితులైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వివరాలు:
అరకు: చెట్టి తనూజ రాణి (అధ్యక్షులు), మురళి కాశీ రాముడు (ప్రధాన కార్యదర్శి)
అరకు : బొబ్బిలి శివప్రసాద్ (అధ్యక్షులు), గాడి లక్ష్మీనారాయణ (ప్రధాన కార్యదర్శి)
శ్రీకాకుళం: మామిడిపూడి రవీంద్ర (అధ్యక్షులు), కొండపల్లి మురళీకృష్ణ (ప్రధాన కార్యదర్శి)
విజయనగరం: కిమిడి నాగార్జున (అధ్యక్షులు), కరణం క్రాంతి (ప్రధాన కార్యదర్శి)
విశాఖపట్నం: గాండి బాబ్జీ (అధ్యక్షులు), ప్రసాదుల వరప్రసాద్ (ప్రధాన కార్యదర్శి)
అనకాపల్లి: బుద్ధ నాగ జగదీశ్వరరావు (అధ్యక్షులు), పాలం రాజు (ప్రధాన కార్యదర్శి)
కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు (అధ్యక్షులు), ముమ్మిడివరపు జగదీష్ (ప్రధాన కార్యదర్శి)
అమలాపురం: గంటి హరీష్ మాధూర్ (అధ్యక్షులు), వెంకట శ్రీమంత్ బాబు (ప్రధాన కార్యదర్శి)
రాజమండ్రి: కే.ఎస్. జవహర్ (అధ్యక్షులు), వెలిగిరి శ్రీనివాసరావు (ప్రధాన కార్యదర్శి)
నరసాపురం: తోట సీతారామలక్ష్మి (అధ్యక్షులు), కోని నవీన్ (ప్రధాన కార్యదర్శి)
బాపట్ల: తెంగు రాజేశ్వరి బాబు (అధ్యక్షులు), నగులు రాఘవ (ప్రధాన కార్యదర్శి)
గుంటూరు: తెనాలి శ్రవణ్ కుమార్ (అధ్యక్షులు), పానకాలమ్మ శ్రీమన్నారాయణ (ప్రధాన కార్యదర్శి)
మచిలీపట్నం: వీరంకి గురుమూర్తి (అధ్యక్షులు), గోపు సత్యనారాయణ (ప్రధాన కార్యదర్శి)
నరసరావుపేట: షేక్ జానే సైదా (అధ్యక్షులు), నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (ప్రధాన కార్యదర్శి)
విజయవాడ: గద్దె అనురాధ (అధ్యక్షులు), చెన్నుబోయిన చిట్టిబాబు (ప్రధాన కార్యదర్శి)
చిత్తూరు: షణ్ముగ రెడ్డి (అధ్యక్షులు), వై. సునీల్ కుమార్ చౌదరి (ప్రధాన కార్యదర్శి)
నెల్లూరు: బీద రవిచంద్ర (అధ్యక్షులు), చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
ఒంగోలు: ఉగ్ర నరసింహ రెడ్డి (అధ్యక్షులు), కొత్తారి నాగేశ్వరరావు (ప్రధాన కార్యదర్శి)
రాజంపేట: సుగవాసి ప్రసాద్ బాబు (అధ్యక్షులు), పఠాన్ ఖాదర్ ఖాన్ (ప్రధాన కార్యదర్శి)
తిరుపతి: పనబాక లక్ష్మి (అధ్యక్షులు), డాలర్ దివాకర్ రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
అనంతపురం: పూల నాగరాజు (అధ్యక్షులు), జి. శ్రీధర్ చౌదరి (ప్రధాన కార్యదర్శి)
హిందూపూర్: ఎం.ఎస్. రాజు (అధ్యక్షులు), హనుమంతప్ప (ప్రధాన కార్యదర్శి)
కడప: చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి (అధ్యక్షులు), వై.ఎస్. జబీవుల్లా (ప్రధాన కార్యదర్శి)
కర్నూలు: గుడిశె కృష్ణమ్మ (అధ్యక్షులు), పూల నాగరాజు యాదవ్ (ప్రధాన కార్యదర్శి)
నంద్యాల: గౌరు చరితా రెడ్డి (అధ్యక్షులు), ఎన్.ఎం.డి. ఫిరోజ్ (ప్రధాన కార్యదర్శి





