Mahaa Daily Exclusive

  పోలీసుల నాకాబంది

Share

లక్షెట్టిపేట,మహా,22 డిసెంబర్:లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో లక్షెట్టిపేట పోలీసులు నాకాబంది నిర్వహించారు.స్థానిక ఎస్సై గోపతి సురేష్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు చర్యలో భాగంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు.వాహనదారులు రవాణా నిబంధనలు పాటించాలని,వాహన పత్రాలు వాహనాల వెంట ఉంచుకోవాలని, కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని,ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు.అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,మత్తు పదార్థాలైన గంజాయి లాంటి వాటికి బానిస కాకూడదని,అలాంటివి రవాణా చేసిన,తరలించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.