లక్షెట్టిపేట,మహా,డిసెంబర్ 26:రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం,డిప్యూటీ సీఎం,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలోని మోదేలలో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంజూరు చేపించడం చరిత్రలో నిలిచిపోతోందన్నారు.రైతుల ఎన్నో ఏండ్ల కలను నెరవేర్చిన ఘనత ఎమ్మెల్యేకే దక్కిందన్నారు.రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని వివరించారు.నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేల ప్రేమ్ సాగర్ రావు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్,పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,డీసీసీ అధికార ప్రతినిది పూర్ణచందర్ రావు, నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు,రైతులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.





