Mahaa Daily Exclusive

  పేదరికాన్ని జయించాలంటే చదువే ఆయుదం:-ఏపీ ముఖ్యమంత్రి

Share

  • పేదరికాన్ని జయించాలంటే చదువే ఆయుదం
  • దేశంలో వివత్తులు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ బాసట
  • ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు.
  • -ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు
  • గండిపేట కుటీరంలోని ఎన్టీఆర్ విద్యాసంస్థలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

మొయినాబాద్ మహా: గండిపేట కుటీరానికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని… ఇక్కడికి రావడం ద్వారా పాతజ్ఞాపకాలు గుర్తుకువచ్చాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నారా భువనేశ్వరీ తనకు పోటీగా వస్తున్నారని నవుతూ అన్నారు. మండలంలోని హిమాయత్ నగర్ లోని ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సాలు శనివారం రాత్రి జరిగాయి. ఈ వేడుకలకు చంద్రబాబునాయుడు, ఆయన సతీమణీ ఎన్టీట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరీతో కలిసి పాల్గొని మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగ్రామిగా నిలిచేందుకు తాను కృషి చేస్తానని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకు పోవాలనే తన ఆకాంక్షన్నారు. 2047లో వికసిత్ భారత్ను మనం తయారు చేసుకుంటుంన్నామన్నారు. గండిపేట కుటీరానికి రావడంతో తనకు పాతజ్ఞాపకాలు గుర్తుకువసు _న్నాయని.. అప్పట్లో రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇచ్చే వారని ప్రస్తుతం విద్యాబుద్ధులు నేర్పించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ మహావృక్షంగా ఈ సంస్థలు ఎదిగాయని పేర్కొన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. ప్రతి దేశంలో తెలుగువాళ్లు 30 శాతం ఉన్నారని అది తెలుగుదేశం యొక్క గొప్పతనమన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా చేయడమే లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు ట్రస్ట్ ద్వారా 9 లక్షల మందికి రక్తాన్ని ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు.రూ. 22 కోట్ల రూపాయలతో దేశంలో విపత్తులు వచ్చిన ఆదుకున్నామని గుర్తుచేశారు. ఏపీలో మహిళ ఆధారిత కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. మారు ప్రాంతాల్లో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. అంతే కాకుండా రాజకీయ కక్ష్యసాధింపు చర్యలు మృ తి చెందిన వారికి కుటుంబాల పిల్లలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య, వసతి కల్పించడం జరిగిందని చెప్పారు. అందరికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివే విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు వెళ్లాలి….
విద్యార్థులు అనుకున్న లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు వెళితే జీవితంలో సాధించలేనిది ఏమి లేదని చంద్రబాబు అన్నారు. పిలల భవిష్యతును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సహాయ సహకారం అందిస్తామని చంద్రబాబు అన్నారు. విజ్ఞానం ఎవరి సొత్తు కాదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని అన్నారు. పోటీ అనేది ప్రపంచంలోనే అనునిత్యం పోటిగానే ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు పికప్ కాకపోతే పిల్లలు ఆన్లైన్లో చదువుకొని ఉపాధ్యాయులకే క్లాసులు చెప్పెస్థాయికి వస్తారన్నారు. నాలెడ్జ్ వారి సొత్తు కాదన్నారు. ఎన్టీఆర్ సమాజంలో సామాజిక న్యాయం విద్య, వైద్య కోసం పనిచేశారని చె ప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తెలుగులోనే మాట్లాడారు. అందరూ ఆంగ్లంలో మాట్లాడితే నేను తెలుగు గడ్డపై పుట్టానని తెలుగులోనే ప్రసంగిస్తానని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన విద్యార్థినీలు పలు సంస్కృతీక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణీ, ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ నారా భువనేశ్వరీ, హెరిటెజ్ ఫుడ్స్ కంపనీ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్టీ క్రిష్ణన్ వెంకటచారి, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజేంద్రకుమార్, తదితరులు హాజరుకానున్నట్లు సీఓఓ గోపి తెలిపారు.

చంద్రబాబును కలిసి స్థానిక నాయకులు…

ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసిశారు. ఆయనను కలిసిన వారిలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కంజర్ల భాస్కర్, మాజీ ఎంపీపీ ముదిగొండ అనిత శ్రీహరి యాదవ్. కొమ్మడి వెం కట్రెడ్డి, కేతిరెడ్డిపల్లి సర్పంచ్ గొడుగు యాదవ్, మోర శ్రీనివాస్ తదితరులు కలిశారు.

Latest