Mahaa Daily Exclusive

  ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం: 28కి పెరిగిన జిల్లాల సంఖ్య.. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం!

Share

  • ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం
  • 28 జిల్లాలుగా ఖరారు చేసిన మంత్రివర్గం
  • కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం
  • మధనపల్లిలో విలీనం కానున్న రాయచోటి జిల్లా
  • కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పు

అమరావతి, మహా : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం అనే మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. తుది గెజిట్ నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో విడుదల కానుంది. సమావేశంలో పలు కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్న రాయచోటి, కొత్తగా సృష్టించిన మదనపల్లె జిల్లాలో విలీనం అవుతుంది. రాజంపేట కడప జిల్లాలో కలుస్తుంది. రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. గూడూరును తిరుపతి జిల్లా నుండి తిరిగి నెల్లూరు జిల్లాకు కలిపేస్తారు. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా ఆమోదం లభించింది. అనివార్య పరిస్థితుల కారణంగా, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పునర్వ్యవస్థీకరణ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.

ఆదోనిలో మూడు కొత్త మండలాలను సృష్టించాలనే ప్రతిపాదనలో, రెండింటికీ మాత్రమే ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజన్, డీఎస్పీ అధికార పరిధి వేర్వేరు ప్రదేశాలలో ఉన్నందున చర్చ నడిచింది. నెల్లూరులో పరిపాలనా సమస్యలపై చర్చలు జరిగాయి. 2025లో ఎన్నో సంస్కరణలకు నాందిగా చంద్రబాబు ప్రకటించారు. 2026లో అధికారులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. రెండు మూడు రోజుల్లో కొత్త జిల్లాలపై గెజిట్ నోటిఫికేషన్ రానుంది. దీనితో జిల్లాల మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారుతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్పులు, చేర్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది.. అయితే జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లె ఉంటుంది.

Latest