Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ‘మహా’ పత్రిక ఎదగాలి: భద్రాద్రిలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Share

మహా పత్రిక ఓ శక్తిగా ఎదగాలి
* దినదిన అభివృద్ధి చెందాలి
* ప్రజల గళాన్ని అధికార యంత్రాంగానికి చేరవేసే వేదికగా “మహా పత్రిక” కొనసాగాలి
* ప్రజల సమస్యల పరిష్కారానికి మీడియా సహకారం ఎంతో అవసరం
* ఆలయాల్లో ఘనంగా “మహా” క్యాలెండర్ ల ఆవిష్కరణ
భద్రాద్రి బ్యూరో, మహా:
ప్రజా సమస్యలను ఎత్తిచూపి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి కీలకపాత్ర పోషిస్తున్న “మహా పత్రిక” రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని పలువురు ఆలయ అర్చకులు దీవించారు. దమ్మున్న వార్తల వేదిక మహా తెలుగు దినపత్రిక యాజమాన్యం ముద్రించిన క్యాలెండర్ల ఆవిష్కరణల కార్యక్రమం మంగళవారం దేవతమూర్తుల ఆశీస్సులతో శ్రీ దాసాంజనేయ స్వామి, శ్రీ భవాని ఆలయం, శ్రీ దత్త సాయి మారుతి దాన్య మందిరం, త్రిమాత దేవాలయంలోని ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా పలువురు ఆలయ పూజారులు మాట్లాడుతూ “మహా దినపత్రిక” దినదిన అభివృద్ధి చందాలని పేర్కొన్నారు.
ప్రజల గళాన్ని అధికార యంత్రాంగానికి చేరవేసే వేదికగా మహా పత్రిక కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. నిజాయితీగల వార్తా ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిస్పాక్షికంగా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికల పాత్ర మరింత బలపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాజ హితం కోసం అంకితభావంతో పని చేస్తున్న మహా జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. మహా పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ఈవో శేషయ్య, దాసాంజనేయ స్వామి ఆలయ అర్చకులు కొండపాక సత్యనారాయణ, భవాని ఆలయ అర్చకులు రవీంద్ర చారి, మహా పత్రిక బ్యూరో ప్రభాకర్ రెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest