Mahaa Daily Exclusive

  చక్రిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి మహా కళ్యాణ్ ఉత్సవం.

Share

 

కుషాయిగూడ జనవరి, 14

కుషాయిగూడ చక్రిపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం ఘనంగా జరిగింది ఆలయ నిర్మాణ కర్త మలుగు ప్రతాపరెడ్డి వారి సతీమణి స్వర్ణలత కుమారులు చక్రధర్ రెడ్డి కుటుంబ సమేతంగా వారితోపాటు భక్తులు భారీ సంఖ్యలో గోదాదేవి కల్యాణోత్సవంలో పాల్గొని రెండు గంటలపాటు వేద ఆశీర్వాదాలు కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు భక్తులు అట్లే కూర్చుండి శ్రీహరి గోవిందా శ్రీహరి గోవిందా నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధనవంతురియే అంటూ నామ స్మరణలతో గోవింద నామాలతో చక్రిపురం కుషాయిగూడ నాగారం ధమ్మాయిగూడ ఇతర కాలనీలా నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు కళ్యాణ్ ఉత్సవం అనంతరం ఆలయ ధర్మకర్తలు ఏర్పాటుచేసిన అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్మాణ కర్తలు ధర్మకర్తలు ఏర్పాట్లను చేసినారు ఆలయ వేద పండితులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కుషాయిగూడ లోని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిక కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని సంతానం లేని వారికి సంతానం కలిగిందని పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యిందని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికిందని మనశ్శాంతి ప్రశాంతత ఇక్కడే ఉంటుందని వేలాదిమంది భక్తుల ఆపదల ముక్కులవాడు ఆపద్బాంధవుడు శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆలయ నిర్మాణ కర్త ఫౌండర్ మోలుగు ప్రతాప్ రెడ్డి కీర్తించారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏది మొక్కుకున్నా కొల్చిన వారికి కొంగు బంగారం అని అందరి దేవుడని శ్రీ వెంకటేశ్వర స్వామి అని అన్నారు.

Latest