- మహిళా ఐఏఎస్ పై ప్రసారాల పట్ల ప్రభుత్వం సీరియస్
- పోలీసుల అదుపులో ముగ్గురు జర్నలిస్టులు
- త్వరలోనే మరిన్ని అరెస్టులని సంకేతాలు
- నోటీసులివ్వకుండా అరెస్టులేమిటి అంటున్న జర్నలిస్టు సంఘాలు
- వార్తలు రాసే సమయంలో సంయమనం అవసరమని సూచన
హైదరాబాద్, మహా : ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా వార్తలు ప్రసా రం చేశారంటూ నమోదైన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు యమస్పీడ్ గా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే సదరు కేసులో మంగళవారం అర్ధ రాత్రి ఓఛానల్ ఇన్ పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్ల ను అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా ఇన్పుట్ ఎడిటర్ ను ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా మహిళా ఐఏఎస్ ను కించపరిచే విధంగా సదరు ప్రధాన చానల్ తో పాటు 44 యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించగా ఈ క్రమంలో ఆయా యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు రంగం సిద్ధ మైనట్లు సమాచారం. ఆయా ఛానల్స్ బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీఎస్ పోలీసులు కసరత్తు ప్రారంభిం చారు. ఇప్పటికే పలువురిని పో లీసులు గుర్తించగా ఈ కేసులో పోలీసుల దూకుడుతో పలువురు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ సీఎం ఫొటో మార్ఫింగ్, మహిళా ఐఏఎస్‌పై అసభ్య కర కథనాలపై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తోంది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు మహిళా అధికారిపై అసభ్యకర కథనాలను మం త్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తీవ్రంగా ఖండించా రు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యాయి. ఇలాంటి వార్తలు అధికారుల మనోభావాలను దెబ్బతీస్తాయని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ నేపద్యంలోనే తాజా అరెస్టులు, త్వరలో కాబోయే అరెస్టులు అంటూ పరిశీలకులు భావిస్తున్నారు.
అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టును ఖండించిన టీయూడ బ్ల్యూజే
ఎన్ టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ లను అర్థ రా త్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీ యూడబ్ల్యూజే పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని టీయూ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అల్లం నారా యణ, ఆస్కానిమారుతి సాగర్, తెంజు అధ్యక్ష, కార్యదర్శు లు విష్ణువర్ధన్ రెడ్డి, ఎ. రమణకుమార్ లు, టీయూడబ్ల్యూ జె నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుండగోని జయ శంకర్ గౌడ్, వీరస్వామి, శివ ప్రసాద్, జిల్లా తెంజు, అధ్యక్ష కార్యదర్శులు వెంకటరెడ్డి, జానయ్యలు పేర్కొన్నారు. జర్నలిస్టులు గానీ, ఆ వార్త సంస్థగాని నిరాధారమైన, అ సత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్య లు తీసుకోవచ్చు కానీ, ఇలా అ ర్థరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టు చేయడం సరైంది కాదు. ఈ ము గ్గురూ జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులు. వీరి అరెస్టును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్న లిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇదే సమయంలో జర్నలిస్టులకు సంఘం తరఫున ఒక సూచన కూ డా చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడంగాని, ప్రచురించవద్దని, ఆ ధారాలు ఉంటేనే వార్తలు వేయాలని, ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్త కథనాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలపై ఉంటుందని గుర్తు చేశారు. ఏది ఏమైనా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అర్ధరాత్రి పూట తీవ్రవాదులను అరెస్టు చేసిన విధంగా అరెస్టు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని, వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.








