Mahaa Daily Exclusive

  కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే ఇవ్వండి: కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు.

Share

  • కేంద్రం నుండి నిధుల వరద కొనసాగాలంటే
  • కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి
  • కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఝప్తి
  • సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ బండారు వేణు

కరీంనగర్, మహా : కేంద్రం నుండి నిధుల వరద కొనసాగాలంటే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఝఫ్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లలో బీజేపీ కార్పోరేటర్లను గెలిపించాలని కోరారు. తద్వారా కరీంనగర్ ను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ అభివృద్ధికి నయాపైసా ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెస్ తోపాటు అధికారంలోకి లేని బీఆర్ఎస్ కు ఓటేయడంవల్ల అభివృద్ధి ఆగిపోయే ప్రమాదముందన్నారు.

బుధవారం బీఆర్ఎస్ కు చెందిన 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారు వేణు, మల్లంపహడ్ మాజీ సర్పంచ్ సాధినేని మునీందర్, 46వ డివిజన్ సీనియర్ నేతలు ప్రమోద్ రావు, గాజె శివరాం బీజేపీలో చేరారు. వీరితోపాటు వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండారు వేణు, సాధినేని మునీందర్, ప్రమోద్ రావు, గాజె శివరాం మాట్లాడుతూ కేంద్రం నుండి వచ్చిన నిధులవల్లే కరీంనగర్ కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ నిధులు, అమృత్ నిధులు సహా అనేక రూపాల్లో కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేస్తున్న కృషికి ఆకర్షితులై బిజెపిలో చేరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షలు బాస సత్యనారాయణ, నగర మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, సీనియర్ నాయకులు కోమాల అంజనేయులు, వాసాల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు

Latest