- ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మహా పత్రిక
- మేలు కొలిపే మహా పత్రిక కథనాలు భేష్ మంత్రి కొండా సురేఖ
- 2026 మహా పత్రిక క్యాలండర్ ను ఆవిష్కరించిన మంత్రి
వరంగల్ మహా;
వాస్తవ కథనాలను ప్రచురిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ అధికారులను మేలు కొలుపుతూ పత్రికా రంగంలోనూ ప్రసార రంగంలోనూ ఓ కొత్త ఒరవడిని సృష్టించిన మహా తెలుగు దినపత్రిక, ఏఎన్ఎన్ చానల్ వార్త కథనాలు అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొంది నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహా పత్రికా యజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా
బుధవారం మహా తెలుగు దినపత్రిక 2026 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలండర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహా పత్రిక యజమాన్యానికి, ప్రతినిధులకు, సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గోపాల్ నవీన్ రాజ్, సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్, 28వ డివిజన్ అధ్యక్షులు కురిమళ్ళ సంపత్ కుమార్, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.








