Mahaa Daily Exclusive

  పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్…..

Share

  • పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్
  • బిల్లులు రాలేదని ఆవేదన
  • వెంటనే స్పందించిన అధికారులు

వలిగొండ జనవరి 19 మహా న్యూస్

వలిగొండ మండల పరిధిలోని సంగెo గ్రామంలో సోమవారం ప్రభుత్వ పాఠశాల గేటుకు మాజీ సర్పంచ్ కీసరి
రామ్ రెడ్డి
తాళం వేశారు సోమవారం ఉదయం పాఠశాల స్పెషల్ క్లాస్ ఉండడంతో ఎనిమిది గంటలకు విద్యార్థులు తాళం గేటును చూసి బయట నిలబడి పోయారు సమాచారం వెంటనే గ్రామస్తులకు అధికారులకు తెలియగానే అధికారులు ఫోన్లో మాట్లాడి గేటు తాళాలు తీయించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు

సర్పంచిని వివరణ కోరగా తాను గతంలో పాఠశాల అభివృద్ధికి 30 లక్షల పైబడి పనులు చేయించానని కేవలం నాకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని మిగతా 28 లక్షల పైబడి రూపాయలు రాకపోవడంతో ఆందోళన చెంది గేటుకు తాళం వేశానని
అధికారులు ఫోన్లో మాట్లాడి బిల్లులు వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడంతో తాళం తీయడం జరిగిందన్నారు

యాదాద్రి
డీఈవో
వివరణ
మాజీ సర్పంచ్ రామ్ రెడ్డికి గతంలో బిల్లులు రావలసిన మాట వాస్తవమేమనని తాము పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో బిల్లులు ఉన్నాయని వెంటనే బిల్లులు మంజూరయ్యేలా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని ఆయన అన్నారు