- తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025
- ఎంట్రీలకు ఆహ్వానం, ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, మహా : 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) పొందిన చిత్రాలకు ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ సమైక్యతపై చలనచిత్రాలు, పర్యావరణం, వారసత్వం, చరిత్రపై చలనచిత్రాలు, తొలి చలనచిత్రాలు, మంచి వినోదం ఆధారంగా రూపొందించిన చిత్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల కింద తెలుగు చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, ప్రభుత్వ సంస్థల నుండి ఎంట్రీలను కార్పొరేషన్ ఆహ్వానించింది.
నోటిఫికేషన్ ప్రకారం, సామాజిక సందేశం కలిగిన ఫీచర్ ఫిల్మ్‌లు, యానిమేషన్ చిత్రాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రాలు, పిల్లల చిత్రాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు వ్యక్తిగత అవార్డులు, డాక్యుమెంటరీ చిత్రాలు, లఘు చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు, విమర్శకులు (వ్యాసాలు), ఉర్దూలో ఫీచర్ ఫిల్మ్‌లకు ఎంట్రీలను సమర్పించవచ్చు. నర్దేశించిన ఎంట్రీ ఫారమ్‌లను నియమ నిబంధనలతో పాటు జనవరి 21, 2026 నుండి కార్పొరేషన్ నుండి పొందవచ్చు. 18 శాతం జీఎస్టీతో సహా రూ. 5,900 చెల్లించి డిమాండ్ డ్రాఫ్ట్/యూపీఐ.. మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో పంపాలి.
ఎంట్రీ ఫారమ్‌లు చివరి తేదీ జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటాయి. పూర్తి చేసిన ఎంట్రీ ఫారమ్‌లను అవసరమైన అన్ని పత్రాలతో చివరి తేదీ ఫిబ్రవరి 3 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్‌లోని టీజీఎఫ్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో సమర్పించాలి. అవార్డుల వివరాలు https://filmin.telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు సినిమాను గౌరవించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2025లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను ప్రారంభించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రదానం చేసిన నంది అవార్డుల స్థానంలో ఈ అవార్డులను ప్రారంభించిన విషయం తెలిసిందే.








