సంగారెడ్డి ప్రతినిధి: మహా :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. డబ్బు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు 24 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సదాశివపేట సీఐ వెంకటేష్ ఆదేశాలతో ఎస్సైలు నాగేష్ ,పెంటయ్య ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుండి సదాశివపేట పట్టణ హైవే కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్లకూడదని అలా తీసుకెళ్తే దానికి సంబంధించిన లెక్కలు కచ్చితంగా ఉండాలన్నారు. లేనిపక్షంలో నగదు సీజ్ చేస్తామన్నారు, మద్యం సరఫరా చేసే బెల్టు షాపులపై నిఘా పెట్టారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్,కానిస్టేబుల్ రాము, భూపతి రాజు తనిఖీలలో పాల్గొన్నారు.
Post Views: 14







