Mahaa Daily Exclusive

  విష్ణు సహస్రనామ పారాయణం.. రామయ్య హనుమద్వాహనాము పై దర్శనం…

Share

రాజేంద్రనగర్ మహా ; శంషాబాద్ మండలం ముచ్చింతల్‌ లోని
శ్రీ రామ నగరంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి వారి పర్యవేక్షణలో
సమతాకుంభ్–2026 బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
సమతాకుంభ్–2026 శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాల మూడోవ రోజు ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆరాధనలు, తీర్ధగోష్టి నిర్వహించారు. సమాతమూర్తి ప్రాంగణంలో రామానుజ నూత్తందాది పారాయణం చేశారు.
రెండొవ రోజున గరుడ వాహనంపై ఊరేగిన 18 దివ్యదేశ మూర్తులకి తిరుమంజన సేవలు నిర్వహించి, అనంతరం అభిషేకం చేశారు.
సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం 37వ దివ్యదేశం నుండి 54వరకు దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు జరిగాయి.
సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహనాము పై భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రసాద గోష్ఠితో ఈ రోజు కార్యక్రమం సంపూర్ణం అయింది.