- మారుతున్న రాజకీయ సమీకరణాలు… చైర్మన్ లోకల్ నాన్ లోకల్
- పట్నం మున్సిపాలిటీలో బీసీ చైర్మన్ నినాదం…
- ఇబ్రహీంపట్నం చైర్మన్ పీఠం జనరల్ స్థానం..
- ఇచ్చిన మాటనా…. లోకల్ నినాదం….
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
పట్నం మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిలర్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను టిఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ రెండవ స్థానంతో సరి పెట్టుకుంది. దీంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పీఠం జనరల్ స్థానం కావడంతో బీసీ నినాదం తెరపైకి వచ్చింది.
చైర్మన్ కాయమనుకున్న తరుణంలో…
బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ కాయం అనుకున్న తరుణంలో బిఆర్ఎస్ బీసీ నినాదం, లోకల్ నినాదం తెరపైకి రావడంతో గందరగోళంతో ఏమి చేయాలని సమాలోచనలు నాయకులు పడ్డారు.. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉండగా అందులో 19 ఇబ్రహీంపట్నం కేంద్రానికి చెందినవి కావడం, మరొక ఐదు వార్డులు శేరిగూడ, ఖానాపూర్, సీతారాంపేట్ గ్రామాలలో ఉండడంతో లోకల్ నినాదం తెరపైకి వచ్చింది. 19 వార్డులు ఉన్న ఇబ్రహీంపట్నంకు చైర్మన్ పదవి ఇవ్వాలంటూ బిఆర్ఎస్ క్యాంపులో లుకలుకలు మొదలవడం జరిగిందని విశ్వసినీయ సమాచారం.
చైర్మన్ అభ్యర్థి ఖాయం అని ఇచ్చిన మాట నిలబడుతుందా, లేదా నేను లోకల్ అనే నినాదానికి చైర్మన్ పదవి వస్తుందా వేచి చూడాలి.








