Mahaa Daily Exclusive

  “ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది”: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కవిత నిప్పులు

Share

  • అసలు సినిమా ముందుంది
  • ఈ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమే
  • తోక పార్టీకి తోక పార్టీగా మారనున్న బీఆర్ఎస్
  • బీజేపీ, బీఆర్ఎస ల పొత్తుకు తొలి అడుగు
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా : తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి చేసిన పోటీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిందన్నారు. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని ప్రకటించిన తక్కువ సమయంలోనే ప్రజలు మమ్మల్ని ఆదరించారన్నారు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన మున్సిపల్ ఎన్నికల్లో 40 మంది విజయం సాధించారన్నారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాకు స్పష్టమైన మెజార్టీ లభించిందని ఆమె వెల్లడించారు. అధికారికంగా 33 స్థానాల్లో మా అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ , మరో 7 చోట్ల బీ ఫామ్ సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచింది కూడా తమ అభ్యర్థులేనని కవిత తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్

గతంలో 90 శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితమైందని కవిత అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో బీఆర్‌ఎస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు. కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుందన్న కవిత ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని సూచించారు.ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు పరోక్షంగా సహకరించారని, ఇది ఆ రెండు పార్టీల పొత్తుకు తొలిమెట్టు అని కవిత ఆరోపించారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోంది. కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐకి మద్దతివ్వటమంటే నయవంచనే అని కవిత ఆరోపించారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సాంబశివరావు కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఆమోదిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని, చాలా చోట్ల రీకౌంటింగ్ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కానీ త్వరలోనే జాగృతి ఆ లోటును భర్తీ చేస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి దక్కింది ఒక్క కరీంనగర్ మేయర్ తప్ప మరెక్కడ లేదన్నారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.30 కోట్లు ఖర్చు చేసినా ఓడిపోయారని కవిత ఎద్దేవా చేశారు.

గ్రామపంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలను, పరిమితులను ముఖ్యమంత్రి పూర్తిగా ఉల్లంఘించారని కవిత ఆరోపించారు.గ్రామ పంచాయితీ ఎన్నికల సమయంలో పట్టణాల్లో, మున్సిపల్ ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం నిర్వహించారన్నారు. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ప్రశ్నించలేదన్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఉందన్న కవిత కచ్చితంగా మాలాంటి వాళ్లను ప్రజలు స్వాగతిస్తారని నమ్మకం ఉందన్నారు.

బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ బలహీన పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. కమ్యూనిస్టులను తోక పార్టీగా అభివర్ణించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సీపీఐకు మద్దతు ఇస్తానంటోందంటూ తోక పార్టీలకే బీఆర్ఎస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. సీపీఐ అడగకుండానే కొత్తగూడెంలో ఆ పార్టీకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వటం దిగజారుడే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్, బీఆర్ఎస్‌‌ను అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు ఎన్ని‌ మాటలు అన్నారో కేటీఆర్‌కు గుర్తు లేదా అని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రా‌జెక్ట్‌పై కూనంనేని ఆరోపణలను కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా అని కవిత నిలదీశారు. కార్మికుల కోసం సీపీఐకు మద్దతు అంటోన్న కేటీఆర్ నయ వంచన చేసుకుంటున్నారని అన్నారు. అవసరం వచ్చినప్పుడు.. బీఆర్ఎస్‌కు కార్మికులు గుర్తొస్తారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని మున్సిపల్ ఫలితాలు చెప్తున్నాయన్నారు. మున్సిపాలిటీలను తీర్చిదిద్దానని చెప్పుకుంటోన్న కేటీఆర్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఈ స్థానాలు రావడమే ఎక్కువ అన్నట్లు కేటీఆర్ మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు.

సింగరేణిలోనూ ఏఐఎప్ బీతో కలిసి పోటీ

‘నేనే రాజు నేనే మంత్రి.. సీఎం పదవి ఆరు నెలలు బోనస్’ అంటోన్న రేవంత్.. రైతుల బోనస్ గురించి మాట్లాడాలని కవిత డిమాండ్ చేశారు. ‘జాగృతిపై కామెంట్స్ చేస్తోన్న వారికి చెప్తున్న.. ఇది జస్ట్ ట్రైలర్.. పిక్చర్ బాకీ హై’ అని అన్నారు కవిత. కరీంనగర్ కార్పొరేషన్ కోసం బీజేపీ అష్టకష్టాలు పడుతోందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో తప్ప బీజేపీ ఎక్కడా లేదన్నారు. సింగరేణి ఎన్నికల్లో కూడా ఏఐఎఫ్‌బీ‌తో కలిసి జాగృతి పోటీ చేస్తుందని ప్రకటించారు. 40కి పైగా స్థానాల్లో జాగృతి, ఏఐఎఫ్‌బీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కవిత. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎవరికి మద్దతివ్వాలో స్థానిక జాగృతి నేతలు డిసైడ్ చేసుకుంటారని తెలిపారు. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారని కవిత ఆరోపించారు.

Latest