Mahaa Daily Exclusive

  రూ.695 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి…

Share

  • రూ.695 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి
  • నాలుగు దశల్లో పనులు
  • మంత్రులు కొండా సురేఖ, పొన్నం సమీక్ష

హైదరాబాద్, మహా : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.695కోట్లతో మాస్టర్ ప్లాన్ ను నాలుగు దశల్లో పూర్తిచేయాలని, తొలి దశకు సంబంధించిన రూ.111.25 కోట్ల పనులను 2027 మార్చి 31లోపు పూర్తి చేయాలని, ఈ ఏడాది వర్షాకాలం రాకముందే రూఫ్ లెవల్ పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సచివాలయంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడ దేవాలయంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. పనులు వేగవంతం చేసి, రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు