- శాటిలైట్ తో సమానంగా కేబుల్ ఛానల్స్ లో వార్తా ప్రసారాలు
- కేబుల్ చానళ్ళకు గతం లోగా అక్రిడిటేషన్లు ఇవ్వాలి
- ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంకకు కేబుల్ టివి అసోసియేషన్ నేతలు
హైదరాబాద్, మహా
శాటిలైట్ చానళ్ళతో సమానంగా వార్తా ప్రసారాలు చేస్తున్న కేబుల్ ఛానల్స్ కు రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం దారుణమని, పాత పద్దతిలో అక్రిడిటేషన్లు ఇవ్వాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్ నెట్ అండ్ నెట్వర్క్ టెలికాం ప్రొవైడర్స్ వెల్ఫర్ అసోయేషన్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ ఛానళ్ళ యాజమాన్యాలు, ప్రతినిధులతో కలిసి స్పెషల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. సవరించిన జీవో ద్వారా సైతం కేబుల్ చానళ్లకు అన్యాయం జరుగుతుంన్నదని,అన్నారు. తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్ నెట్ అండ్ నెట్వర్క్ టెలికాం ప్రొవైడర్స్ వెల్ఫర్ అసోయేషన్ అధ్యక్షులు, టీపీసీసీ సేవాదళ్ ఛైర్మెన్ మిద్దెల జితేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సవరించిన జిఓ తో కూడా కేబుల్ ఛానెల్స్ నష్టపోతున్నాయని, శాటిలైట్ తో సమానంగా కేబుల్ ఛానెల్స్ కూడా వార్తలను ప్రసారం చేస్తాయని, గతంలో మాదిరిగానే కేబుల్ ఛానల్స్ కి అక్రిడేషన్ కార్డును అందించాలన్నారు. రాష్ట్రస్థాయిలో 12 కార్డులు, ప్రసారమవుతున్న ప్రతీజిల్లాలో నాలుగు కార్డులు ఇవ్వాలన్నారు. అధికారులు కక్షపూరితంగా వ్యవహరించడం పరికాదని, కేబుల్ ఛానల్స్ కు అన్యాయం చేయాలనుకుంటే ఎంతదూరమైనా వెళ్తామని, అధికారులు లోపాలు సరిచేయాలన్నారు.








