Mahaa Daily Exclusive

  ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు…….

Share

  • ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు
  • పలు పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, మహా : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో సంగారెడ్డి ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజ్, సెయింట్ ఆంథోని కాలేజ్, ఎస్.వి జూనియర్ కాలేజ్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను, మెడికల్ ఎమర్జెన్సీ టీమ్‌ను, కనీస వసతులు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసరాల్లో ఎవ్వరూ గుంపులుగా తిరగడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడుతున్నందున, పరీక్ష కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచరాదన్నారు.