- మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డినే
- మరో రెండేళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..
హైదరాబాద్, మహా : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్ళు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండోసారి నియమితులైన కే శ్రీనివాస్ రెడ్డిని టియూడబ్ల్యూజే – ఐజేయు మేడ్చల్ జిల్లా తరపున రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్, జిల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రాంరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, హెచ్ యుజె అధ్యక్షుడు శిగా శంకర్ లు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 3








